మోకాళ్లపై నిల్చున్న ‘బాహుబలి’

Prabhas Goes Down On His Knee To Click A selfie For His Fan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. సినిమాల్లో ఎంతో గంభీరంగా కనిపించే ప్రభాస్‌, నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. ప్రేమతో అందరిలో కలిసిపోతారు. ఇందుకు నిదర్శనం తాజాగా ఓ అభిమానితో దిగిన సెల్ఫీనే ఉదాహరణ. దివ్యాంగ అభిమానితో సెల్ఫీ దిగేందుకు మోకాళ్లపై నిల్చుని తన గొప్పతనం మరోసారి చాటుకున్నారు. విషయం ఏంటంటే.. ఇటీవల ఆయన అభిమానులతో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తన అభిమాన హీరో ప్రభాస్‌ని చూసేందుకు దివ్యాంగుడైన ఓ అభిమాని ఆకార్యక్రమానికి వచ్చారు. సెల్ఫీ దిగాలని ఉందని తన మనసులో కోరిక బయటపెట్టారు. ఆ అభిమాని చూపే ప్రేమకు ప్రభాస్‌ మనసు కరిగిపోయింది.. అభిమానికి సౌకర్యంగా ఉండేలా మోకాలిపై కూర్చుని అతని భుజంపై చేయి వేసి మరీ సెల్ఫీ తీసుకున్నారు. దీంతో, అభిమాని ఆనందానికి అవధులు లేవు. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా షేర్‌ అవుతోంది. ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుజిత్‌ దర్శకుడు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top