అవును.. నేను, మా భర్త విడిపోయాం! | pooja bhatt takes twitter to announce seperation from husband | Sakshi
Sakshi News home page

అవును.. నేను, మా భర్త విడిపోయాం!

Dec 8 2014 6:11 PM | Updated on Apr 3 2019 6:23 PM

అవును.. నేను, మా భర్త విడిపోయాం! - Sakshi

అవును.. నేను, మా భర్త విడిపోయాం!

ఈ నవ్వులు.. ఈ మరిపాలు ఇక దూరం అయిపోయాయి. అవును.. బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత పూజాభట్ తన భర్త మున్నా నుంచి విడిపోయింది.

ఈ నవ్వులు.. ఈ మరిపాలు ఇక దూరం అయిపోయాయి. అవును.. బాలీవుడ్ నటి, దర్శకురాలు, నిర్మాత పూజాభట్ తన భర్త మున్నా నుంచి విడిపోయింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలందరికీ తెలిపింది. తమను ఎంతో అభిమానించేవాళ్లకు, అస్సలు అభిమానించని వాళ్లకు కూడా ఈ విషయం చెబుతున్నట్లు తెలిపింది. 11 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తామిద్దరం నిర్ణయించుకున్నామంది. ఇద్దరి మధ్య విడాకుల ప్రక్రియ చాలా సాఫీగా జరిగిపోయిందని, ఒకరి పట్ల మరొకరికి ఇంతకుముందు ఉన్నట్లే గౌరవం ఎప్పటికీ ఉంటుందని పూజాభట్ చెప్పింది.

తామిద్దరం కూడా ప్రజాజీవనంలో ఉన్నాము కాబట్టే.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అందరికీ చెప్పానని, ఇక మీదట ఏం జరుగుతుందో ఊహించుకోడానికి తన స్నేహితులు, శ్రేయోభిలాషులు, శత్రువులు.. అందరికీ స్వేచ్ఛ ఉందని చెప్పింది.

ఇక ఈ విషయం ఆమె వెల్లడించిన తర్వాత ట్విట్టర్లో వందలకొద్దీ సందేశాలు వెల్లువెత్తాయి. కానీ, ఇన్నాళ్లుగా తనకు పెద్దగా తెలియనివాళ్లంతా తనకు చాలా మద్దతు ఇచ్చేలా ప్రేమాభిమానాలు చూపించారని, దాంతో తాను చలించిపోయానని ఆ తర్వాత పూజా చెప్పింది. కానీ తన స్నేహితుల్లో మాత్రం చాలామంది నిశ్శబ్దాన్నే పాటించారంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement