‘మన్మథుడు’కి జోడిగా..!

Payal Rajput in King Nagarjuna Manmadhudu Sequel - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌. ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తొలి సినిమాతో గ్లామర్‌ షోతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పాత్ర ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.

కింగ్‌ నాగార్జున హీరోగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మథుడు సీక్వల్‌లో పాయల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి షూటింగ్ ప్రారంభ కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top