‘రంగస్థలం’ సక్సెస్‌ మీట్‌కు పవన్‌‌..?

Pawan Kalyan Chief Guest For Rangasthalam Success Meet - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ భారీ కలెక్షన్లు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్‌ తన నటనతో అందర్ని ఆకట్టుకున్నారు. రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌కు ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి పెట్టింది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం విజయానందంలో ఉంది. ‘రంగస్థలం’ టీమ్‌ తమ సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకోనున్నారు.

ఏప్రిల్‌ 12 ఈ సెలబ్రేషన్‌ ఈవెంట్‌ నగరంలోని నోవాటెల్‌ హోటల్లో ఘనంగా జరగనున్నట్లు సమాచారం. మొదట ఈ వేడుక అమరావతిలో చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ, హైదరాబాద్‌లోనే చేస్తున్నారనే క్లారిటీ వచ్చేసింది. ఈ వేడుకకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని సమాచారం. తాజాగా పవన్‌ కల్యాణ్‌ భార్యతో కలిసి ‘రంగస్థలం’ చిత్రాన్ని చూసిన విషయం తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా’ షూటింగ్‌లో బిజీగా ఉన్నందున ఈ వేడుకకు హాజరు కావడం అనుమానమే అని చెబుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top