
ఊహలు గుసగుసలాడె...
నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఊహలు గుస గుసలాడె’. సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శౌర్య,
నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఊహలు గుస గుసలాడె’. సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శౌర్య, రాశి ఖన్నా ముఖ్య పాత్రధారులు. కల్యాణి కోడూరి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సాయి కొర్రపాటి పాటలు సీడీని ఆవిష్కరించి అతిథులకు అందించారు. నటునిగా పరిశ్రమకు పరిచయమైనా, దర్శకత్వం తన లక్ష్యమని, సాయి కొర్రపాటి లాంటి నిర్మాత దొరకడం తన అదృష్టమని, నటీనటుల అభినయం, కల్యాణి కోడూరి పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అవసరాల శ్రీనివాస్ అన్నారు. అతిథులుగా విచ్చేసిన డి.సురేశ్‌బాబు, ఎం.ఎం.కీరవాణి, ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, గుణ్ణం గంగరాజు, ఇంద్రగంటి మోహనకృష్ణ, బోయపాటి శ్రీను, అల్లరి నరేశ్, నాని, నందినీరెడ్డి, జెమినీ కిరణ్, దాము సినిమా విజయం సాధించాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.