క్వీన్‌పై నయన కన్ను | nayana tara iontrested in Queen Movie | Sakshi
Sakshi News home page

క్వీన్‌పై నయన కన్ను

Apr 17 2014 12:39 AM | Updated on Sep 2 2017 6:07 AM

క్వీన్‌పై  నయన కన్ను

క్వీన్‌పై నయన కన్ను

క్వీన్‌పై నయనతార కన్నేశారనగానే ఆమె రాణి కావాలనుకుంటున్నారా? అనే ఆలోచన కలుగుతుందా? ఒక రకంగా ఆమె కోరిక అదే. అయితే ఈ బ్యూటీ సినిమాలో క్వీన్‌గా జీవించాలనుకుంటున్నారు.

క్వీన్‌పై నయనతార కన్నేశారనగానే ఆమె రాణి కావాలనుకుంటున్నారా? అనే ఆలోచన కలుగుతుందా? ఒక రకంగా ఆమె కోరిక అదే. అయితే ఈ బ్యూటీ సినిమాలో క్వీన్‌గా జీవించాలనుకుంటున్నారు. అర్థం కాలేదా? అయితే చదవండి. నయనతార హీరోయిన్‌గా సెకండ్ ఇన్నింగ్‌లో ఆరంభం, రాజారాణి, ఇదు కదిర్ వేళన్ కాదల్ అంటూ వరుసగా హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ సరసన నన్భేండా, శింబుకు జంటగా ఇదు నమ్మాళు చిత్రాలతోపాటు టాలీవుడ్ నటుడు గోపిచంద్‌తో ద్విభాషా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరో చిత్రం నీ ఎంగే ఎన్ అన్భే త్వరలో తెరపైకి రానుంది.ఇది హిందీ చిత్రం కహానికి రీమేక్. హిందీలో విద్యాబాలన్ నటించిన పాత్రను నయనతార పోషించారు. ముఖ్యపాత్రలో వైభవ్ నటించిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. తాజాగా నయనతార కన్ను బాలీవుడ్ చిత్రం క్వీన్‌పై పడింది.

 చిత్రం ఈ అమ్మడికి పిచ్చపిచ్చగా నచ్చేసిందట. హిందీలో కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ పాత్రను దక్షిణాదిలో నయనతార పోషించాలని ఆశపడుతున్నారట. ఈ చిత్ర రీమేక్ హక్కులు కొనుగోలు చేయూలని తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు నిర్మాతలకు చెప్పారట. ఈ బ్యూటీతో పాటు క్వీన్ చిత్రంతో నటించాలని ఆశిస్తున్న హీరోయిన్ల వరుసలో  సమంత కూడా ఉండడం విశేషం. ఇటీవల క్వీన్ చిత్రం చూసిన ఈ భామ కంగనా రనౌత్ నటనపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇలాంటి పరిస్థితిలో మరి దక్షిణాది క్వీన్ ఎవరవుతారన్నది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement