వెబ్ సీరీస్ లో మరో యంగ్ హీరో

mana mugguri Love story

ప్రస్తుతం టీవీ, సినీ రంగాలతో పాటు డిజిటిల్ మీడియా కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగా సీరియల్స్, సినిమాలతో పాటు వెబ్ సీరీస్ ల నిర్మాణం కూడా ఊపందుకుంది. డిజిటల్ మీడియం ద్వారా భారీ పబ్లిసిటీ, రెవెన్యూ వస్తుండటంతో సినీ నటులు కూడా వీటి మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే సుమంత్ అశ్విన్, వరుణ్ సందేశ్ లతో పాటు స్టార్ హీరో రానా కూడా వెబ్ సీరీస్ లలో నటిస్తున్నారు.

తాజాగా మరో యంగ్ హీరో నవదీప్ కూడా ఈ లిస్ట్ లో చేరాడు. హీరోగా ఎంట్రీ , తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఆకట్టుకుంటున్నాడు. గతంలో ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నవదీప్, ఇటీవల బిగ్ బాస్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇప్పుడు భారతదేశం బయట ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు వెబ్ సీరీస్ లలో నటించనున్నట్టుగా తెలిపారు నవదీప్.

మన ముగ్గురి లవ్ స్టోరి పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరీస్ లో తేజస్వీ కీలక పాత్రలో నటించనుంది. వైజయంతి మూవీస్ కు చెందిన వెబ్ డివిజన్ ఎర్లీ మాన్సూన్ టేల్స్ ఈ  వెబ్ సీరీస్ ను నిర్మిస్తోంది. నందినీ రెడ్డి పర్యవేక్షణలో శశాంక్ ఏలేటీ ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top