సెన్సేషనల్ కంపెనీ సీఈవోగా రానా | Rana in web series Social | Sakshi
Sakshi News home page

సెన్సేషనల్ కంపెనీ సీఈవోగా రానా

Sep 2 2017 10:28 AM | Updated on Aug 11 2019 12:52 PM

సెన్సేషనల్ కంపెనీ సీఈవోగా రానా - Sakshi

సెన్సేషనల్ కంపెనీ సీఈవోగా రానా

ఇప్పటికే హీరోగా, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన యువనటుడు రానా, ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు.

ఇప్పటికే హీరోగా, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన యువనటుడు రానా, ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే ప్రయోగాలు చేస్తున్న భల్లాలదేవ ఇప్పుడు వెబ్ మీడియాలోకి అడుగుపెట్టాడు. తాను వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమ నిర్మాతల కోసం ఓ వెబ్ సిరీస్ లో నటించాడు.

నెంబర్ వన్ యారి విత్ రానా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వియూ సంస్థ ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లతో ఆకట్టుకుంటోంది. తాజా రానా, నవీన్ కస్తూరియాలతో ఓ 'సోషల్' పేరుతో మరో వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తోంది. సోషల్ మీడియాకు అలవాటు పడిన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటోంది అన్న నేపథ్యంలో ఈ వెబ్ సీరీస్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

సోషల్ మీడియా కారణంగా ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయో థ్రిల్లింగ్ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో రానా ప్రపంచంలోనే సెన్సేషనల్ టెక్ కంపెనీగా పేరు తెచ్చుకున్న 'సోషల్ ' కంపెనీ సీఈఓ  విక్రమ్ సంపత్ గా కనిపిస్తున్నాడు. ఏ క్లిక్ కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement