‘రారా.. జగతిని జయించుదాం..’ | Nanis Gang Leader Movie First Song Launched | Sakshi
Sakshi News home page

‘రారా.. జగతిని జయించుదాం..’

Jul 19 2019 7:11 PM | Updated on Jul 19 2019 7:48 PM

Nanis Gang Leader Movie First Song Launched - Sakshi

రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల తర్వాత భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

అనంత శ్రీరామ్‌ రచించిన 'రారా.. జగతిని జయించుదాం.. రారా చరితని లిఖించుదాం..' అంటూ సాగే పాటను అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత నేతృత్వంలో పృథ్వీచంద్ర, బాషెర్‌మాక్స్‌ ఆలపించారు. ఈ పాటలోని ర్యాప్‌ను కూడా బాషెర్‌మాక్స్‌ క్రియేట్‌ చేశారు. చక్కని పదాలతో అనంతశ్రీరామ్‌ రాసిన ఈ పాట అందర్నీ ఇన్‌స్పైర్‌ చేసేలా ఉంది. అనిరుధ్‌ మ్యూజిక్‌ మెస్మరైజ్‌ చేసేలా ఉంది. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement