దాసు.. ఏంటి సంగతి

Nagarjuna Akkineni and Nani's ‘Devadas’ shoot almost done - Sakshi

దేవ (నాగార్జున) డాన్‌. దాసు (నాని) డాక్టర్‌. డాన్‌కీ, డాక్టర్‌కీ స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిశారు. దేవ మందు తాగేందుకు సిద్ధం అవుతుంటే దాసు కూడా గ్లాస్‌ పట్టుకొచ్చి ‘నాక్కూడా’ అంటూ సైగ చేశాడు. దాసు గ్లాసులో మందు పోసిన దేవ అందులోకి ‘సోడా కావాలా? వాటర్‌ కావాలా?’ అని  అడిగి వాటికోసం వెనక్కి తిరుగుతాడు. అంతలోపే దాసు ఆత్రంగా గ్లాసులోని మద్యం తాగేసి మిన్నకుండిపోతాడు. మళ్లీ మందు పోసిన దేవ ‘సోడా కావాలా? వాటర్‌ కావాలా? అంటుండగానే మరో గ్లాసు మద్యం తాగేస్తూ దొరికిపోతాడు దాసు.

అప్పుడు.. ‘దాసు.. ఏంటి సంగతి’ అని దేవ ప్రశ్నిస్తాడు. ఇదీ ‘దేవదాసు’ చిత్రం టీజర్‌లో కనిపించిన సరదా సన్నివేశం. నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ ‘దేవదాసు’. రష్మికా మండన్న, ఆకాంక్షా సింగ్‌ కథానాయికలు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే బ్యాంకాక్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. సెప్టెంబర్‌ 27న చిత్రం రిలీజ్‌ కానుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: సి. ధర్మరాజు, కెమెరా: శ్యామ్‌ దత్‌ సైనూద్దీన్, సంగీతం: మణిశర్మ.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top