నాన్‌స్టాప్‌గా ఎర్రబస్సు! | manchu vishnu as hero in dasari narayana rao 151 th Erra Bassu movie | Sakshi
Sakshi News home page

నాన్‌స్టాప్‌గా ఎర్రబస్సు!

Jul 28 2014 12:34 AM | Updated on Sep 2 2017 10:58 AM

నాన్‌స్టాప్‌గా ఎర్రబస్సు!

నాన్‌స్టాప్‌గా ఎర్రబస్సు!

కల్లాకపటం లేకుండా, అమాయకంగా మాట్లాడే పల్లెటూరి వ్యక్తిని చూస్తే ‘వీడెవడ్రా.. ఇప్పుడే ఎర్రబస్సు దిగినట్టున్నాడు?’ అనే కామెంట్లు వినిపిస్తాయి. ‘ఏరా ఎర్రబస్సు’..

కల్లాకపటం లేకుండా, అమాయకంగా మాట్లాడే పల్లెటూరి వ్యక్తిని చూస్తే ‘వీడెవడ్రా.. ఇప్పుడే ఎర్రబస్సు దిగినట్టున్నాడు?’ అనే కామెంట్లు వినిపిస్తాయి. ‘ఏరా ఎర్రబస్సు’.. అని నిక్‌నేమ్ పెట్టేసి మరీ పిలుస్తుంటారు. అలా పల్లె నుంచి నగరానికొచ్చిన ఓ అమాయకపు పెద్దాయనగా దాసరి నారాయణరావు కనిపించనున్నారు. సినిమా పేరు ‘ఎర్రబస్సు’... కథకు తగ్గట్టుగా ఉంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేశారు దాసరి.
 
  తమిళ చిత్రం ‘మంజా పై’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తారకప్రభు ఫిలింస్ పతాకంపై దాసరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ తాత, మనవళ్ల కథలో.. తాతగా దాసరి, మనవడిగా మంచు విష్ణు నటిస్తుండటం విశేషం. దర్శకునిగా దాసరికి ఇది 151వ చిత్రం. నేడు ఈ చిత్రం ప్రారంభమైంది. విష్ణు, కేథరిన్ పాల్గొనగా లహరి గార్డెన్స్‌లో పాట చిత్రీకరిస్తున్నారు. అనంతరం జంట నగరాల్లోని పలు లొకేషన్స్‌లో షెడ్యూల్స్‌ని ప్లాన్ చేశారు.
 
  చిత్రవిశేషాలను దాసరి తెలియజేస్తే-‘‘అరవై రోజులు ఏకధాటిగా జరిపే షూటింగ్‌తో ఈ చిత్రం పూర్తవుతుంది. అన్ని భాషలవారికీ, అన్ని వయసుల వారికీ నచ్చే కథ ఇది. భావోద్వేగాలకు ఈ కథలో పెద్దపీట వేయడం జరిగింది. వాస్తవానికి అద్దం పట్టేలా పాత్రలుంటాయి’’ అని చెప్పారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణుడు, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, బేబీ నిరాజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: అంజి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement