తిరిగి వస్తున్నాను

Manchu Manoj Confirms Divorce with Wife Pranathi Reddy - Sakshi

కొంతకాలంగా మంచు మనోజ్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొత్త సినిమాలేమీ చేయడం లేదు. సినిమాలకు వచ్చిన విరామానికి కారణమేంటో క్లారిటీగా తెలియదు. అయితే సినిమాల్లో వచ్చిన ఈ గ్యాప్‌కి వ్యక్తిగత విషయాలే కారణాలని మనోజ్‌ తెలిపారు. అంతేకాకుండా తన భార్య ప్రణతి నుంచి విడిపోయినట్టు ప్రకటించారు. ఈ విషయాన్నంతా ఓ లేఖ ద్వారా పంచుకున్నారు మనోజ్‌. ఆ లేఖ సారాంశం ఈ విధంగా...
‘‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను మీతో (ప్రేక్షకులు/అభిమానులు) పంచుకోవాలనుకుంటున్నాను.

మా వివాహ బంధాన్ని విడాకులతో ముగించాం అని బరువైన హృదయంతో తెలియజేస్తున్నాను. అభిప్రాయబేధాలతో మేమిద్దరం కొన్ని రోజులు బాధపడ్డాం. ఆ తర్వాత బాగా ఆలోచించి విడివిడిగానే మా జీవితాలను కొనసాగించాలని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. విడిపోయినప్పటికీ మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం, మర్యాదలు ఉన్నాయి. మా నిర్ణయాన్ని అందరూ అర్థం చేసుకొని మా ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ సమయంలో నా మనసు మనసులా లేకపోవడంతో నేను ఏ పనీ సరిగ్గా చేయలేకపోయాను.

ఈ మానసిక అలజడిని దాటగలుగుతున్నానంటే మా కుటుంబం, స్నేహితులు, ముఖ్యంగా నా అభిమానులు నాతో నిలబడటమే కారణం. ఇలాంటి సమయాల్లో నన్ను సపోర్ట్‌ చేసిన అందరికీ రుణపడి ఉంటాను. నేను ఎంతో ప్రేమించే పని, నాకు తెలిసిన ఒక్కటే పని.. సినిమాల్లో నటించడం. అది చేయడానికి తిరిగొస్తున్నాను. నా ఫ్యాన్స్‌ను అలరించడానికి కçష్టపడతాను. సినిమాలే నా ప్రపంచం. నా చివరి క్షణాల వరకు సినిమాలోనే రాక్‌ చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top