మంజుల ‘మనసుకు నచ్చింది’ ట్రైలర్‌ అదిరింది!

Manasuku Nachindi Theatrical Trailer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహేశ్‌బాబు సోదరి ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘మనసుకు నచ్చింది’ . సందీప్‌ కిషన్‌, అమైరా దస్తూర్‌, త్రిధా, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ను మహేశ్‌బాబు చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు.

ఒక అందమైన ప్రేమకథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. ‘ పెండ్లీకూతురే.. పెండ్లికొడుకును లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్‌ చూస్తున్న నేను’ అన్న ప్రియదర్శి డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. మనసుకు నచ్చింది చేసేందుకు ఎంతదూరమైన వెళ్లే ఒక జంట ప్రేమకథ ఎలా మొదలైంది.. అన్న ఆసక్తికరమైన అంశంతో మోడ్రన్‌ యూత్‌ జీవనశైలికి దగ్గరగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌లో త్రిధా బికినీలో కనిపించడం గమనార్హం. స్నేహం, ప్రేమ అందులోని ఎమోషన్స్‌తో ఈ సినిమా ‘మనసుకు నచ్చేలా’ తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top