నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్‌ ఫొటోలు | Man held for sharing private pictures of actor | Sakshi
Sakshi News home page

నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్‌ ఫొటోలు

Jul 24 2017 1:49 PM | Updated on Jul 29 2019 5:31 PM

నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్‌ ఫొటోలు - Sakshi

నటికి పెళ్లి హామీ.. మోసం.. ప్రైవేట్‌ ఫొటోలు

ఓ సినీ నటితో సన్నిహితంగా ఉండి ఆమె ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేసిన ఆరోపణలు కూడా అతడిపై నమోదు చేశారు.

కొచ్చి: ఓ సినీ నటితో సన్నిహితంగా ఉండి ఆమె ప్రైవేట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మోసం చేసిన ఆరోపణలు కూడా అతడిపై నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరణ్‌ కుమార్‌ (38) అనే వ్యక్తికి మలయాళంలో ఓ ప్రముఖ నటికి పరిచయం ఉంది. అతడు ఇండస్ట్రీలో ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ విభాగంలో పనిచేసేవాడు. తొలుత వారిమధ్య పరిచయం ఉండేది. కాలక్రమంలో అదికాస్త మరింత ఎక్కువై ఇద్దరు సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రైవేట్‌ సంబంధం కూడా మొదలైంది. ఈ సమయంలోనే అతడు పెళ్లి చేసుకుంటానని కూడా ఆ నటితో చెప్పాడు. అప్పుడే వారు పలు ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే, అతడికి అప్పటికే వివాహమయినా ఆమె చెప్పకపోవడం ఆ తర్వాత ఆ నటి తెలుసుకొని అతడు మోసగాడని గుర్తించి దూరం పెట్టింది. అయితే, డబ్బును డిమాండ్‌ చేస్తూ బెదిరించే క్రమంలో వారిద్దరు కలిసి దిగిన ప్రైవేట్‌ ఫొటోలను కిరణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆ నటి పోలీసులను ఆశ్రయించగా వారు అతడిని నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌తో అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement