రాజీ లేదు

Lloyd Stevens shares the rigorous leg extension of Junior NTR  - Sakshi

యాక్టింగ్‌ విషయంలోనే కాదు వర్కౌట్స్‌ పరంగానూ రాజీ పడేలా లేరు ఎన్టీఆర్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం ఫిట్‌గా ఉండడానికి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ కథానాయికగా నటిస్తున్నారు.

ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తయిందని సమాచారం. నెక్ట్స్‌ షెడ్యూల్‌ పుణే, అహ్మదాబాద్‌ ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. ఈలోపు జిమ్‌లో తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ జిమ్‌ ట్రైనర్‌ స్టీవెన్‌ లాయిడ్స్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ‘అరవిందసమేత వీర రాఘవ’ సినిమా సమయంలోనూ ఎన్టీఆర్‌కి ట్రైనర్‌గా స్టీవెన్‌ వ్యవహరించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top