ఆ నలుగురు లేకుంటే కొబ్బరిమట్ట లేదు

Kobbari Matta Trailer Launch - Sakshi

‘హృదయ కాలేయం’ ఫేమ్‌ సంపూర్ణేష్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి రాజేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రోనాల్డ్‌ సన్‌ మాట్లాడుతూ– ‘‘హృదయకాలేయం’ విడుదల సమయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఎవరీ హీరో.. మార్కెట్‌ అవుతుందా? అనే ప్రశ్నలతో వ్యాపారం మందకొడిగా సాగింది. విడుదల తర్వాత ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది. ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని ‘బాహుబలి’ తరహాలో ఐదేళ్లు తీశాం.  ప్రమోషన్‌లో భాగంగా ఒక్కో ట్రైలర్‌ విడుదల చేయగా సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇండస్ట్రీలో ఆ నలుగురు వల్లే మా చిత్రం నిలబడింది.

గీతా ఆర్ట్స్‌ సంస్థ ద్వారా మా చిత్రం విడుదలకాబోతుంది. నైజాంలో ‘దిల్‌’ రాజుగారు విడుదల చేస్తున్నారు. ఆ నలుగురు లేనిదే ‘కొబ్బరిమట్ట’ లేదు. కథ బాగుంటే విడుదలకు సహకరిస్తారనేందుకు మా చిత్రమే నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించాను. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్‌ , రొమాన్స్, సందేశం.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి’’ అన్నారు సంపూర్ణేష్‌బాబు. ‘‘నాలుగేళ్ల ప్రయాణం మా చిత్రం. గీతా ఆర్ట్స్‌ సహకారంతో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మా సినిమాకి ఇప్పటికే టికెట్స్‌ బుకింగ్‌ 80శాతం పూర్తయ్యాయి’’ అన్నారు సాయిరాజేష్‌. నిర్మాత ఎస్‌కె.ఎన్, కత్తి మహేష్, ఏలూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top