పహిల్వాన్‌గా కిచ్చ సుదీప్‌

Kiccha Sudeep starrer Pailwan First Look - Sakshi

స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిస్తున్న  పహిల్వాన్‌. ఈ సినిమాలో కన్నడ హీరో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే కసరత్తులు సైతం చేశారు.  ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తుండటంతో విశేషం. తొలిసారిగా సుదీప్‌ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు.

సినిమాకు ఎస్‌.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అర్జున్‌ జన్యా సంగీతాన్ని అందిస్తున్నారు. స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే నిపుణున్ని పిలిపించారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఏకంగా 20 సెట్లను రూపొందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top