‘అంతకంటే ముందు నేను ఓ పని చేయాలి’ | Khushi Kapoor Says That One Thing She Has To Do Before Working With Family | Sakshi
Sakshi News home page

‘దాని కంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలి’

Jul 7 2020 4:07 PM | Updated on Jul 7 2020 4:51 PM

Khushi Kapoor Says That One Thing She Has To Do Before Working With Family - Sakshi

న్యూయార్క్‌: నటిగా తనను తాను నిరూపించుకున్నాకే తన కుటుంబంతో కలిసి పనిచేస్తానని అలనాటి నటి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు ఖుషీ కపూర్‌​ అన్నారు.  నటి శ్రీదేవి, బోనీ కపూర్‌ల చిన్న కూమార్తె ఖషీ కపూర్‌. తల్లి శ్రీదేవి, సోదరి జాన్వీ కపూర్‌లాగే హీరోయిన్‌ కావాలని ఖుషీ కపూర్‌ కోరుకుంటున్నారు. ఉన్నత చదువుల కోసం గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్ వెళ్లిన ఖుషీ అక్కడే న్యూయర్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో ఖుషీ మూవీకి సంబంధించిన కోర్సు పూర్తి కూడా చేస్తున్నారు. ఇక త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం న్యూయార్కులోనే ఉన్న ఖుషీ తన స్కూల్‌ అకాడమీ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో.. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తూ, న్యూయార్క్‌ ఫిల్మ్‌ స్కూల్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. (చెఫ్‌గా మారిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై)

తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. ‘నా ఫ్యామిలీ బిజినెస్‌ చూస్తుంటారు. నా కుటుంబంతో కలిసి పనిచేసేందుకు నేనెప్పుడూ ఇష్టపడతాను. కానీ అందుకు కొంచెం సమయం పడుతుంది. అంతకంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలి. నటిగా నా స్థానాన్ని నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. ఫిల్మ్‌ స్కూల్లో నన్ను నేను మెరుగుపరుచుకున్నాను. ఇప్పుడు నేను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను’. అంటూ పేర్కొన్నారు. కాగా ఖుషీకి నటన వారసత్వంగానే ఉంది. ఆమె నిర్మాత సురీందర్‌ కపూర్‌ మనవరాలు. తండ్రి బోనీ కపూర్‌ కూడా నిర్మాతే. తల్లి శ్రీదేవి సోదరి జాన్వీ కపూర్‌, సోదరుడు అర్జున్‌ కపూర్‌ అంతా బాలీవుడ్‌ నటులే. ఇక ఖుషీ తన నటనతో బాలీలవుడ్‌లో ఏ మేరకు రాణించగలరో చూడాలంటే కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. (విశాల్ రహస్యాలను బయట పెడతా: రమ్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement