మళ్లీ జోడీగా! | Khaki Release Date On Nov 17th | Sakshi
Sakshi News home page

మళ్లీ జోడీగా!

Oct 9 2017 1:08 AM | Updated on Oct 9 2017 1:08 AM

Khaki Release Date On Nov 17th

హిట్‌ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లకు ‘హిట్‌ పెయిర్‌’ అనే పేరొస్తుంది. ఆ జంటతో సినిమాలు తీయడానికి దర్శక–నిర్మాతలు ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపిస్తారు. అయితే కొంచెం డిఫరెంట్‌గా కార్తీ–రకుల్‌  మాత్రం తమ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫస్ట్‌ మూవీ విడుదల కాకముందే మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నది కోలీవుడ్‌ టాక్‌. హెచ్‌.

వినోద్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధీరమ్‌ అధిగారమ్‌ ఒండ్రు’లో ఈ ఇద్దరూ నటించారు. ఆ సినిమా తెలుగులో ‘ఖాకీ’గా నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు కార్తీ–రకుల్‌ మరో సినిమా ఒప్పుకున్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో కొత్త దర్శకుని సారథ్యంలో ఓ రొమాంటిక్‌ మూవీ తెరకెక్కనుందని కోలీవుడ్‌ టాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement