'ఖాకీ' డ్రస్లో కార్తీ | Karthi New movie telugu title Khaki | Sakshi
Sakshi News home page

'ఖాకీ' డ్రస్లో కార్తీ

Jul 1 2017 11:33 AM | Updated on Jul 23 2019 11:50 AM

'ఖాకీ' డ్రస్లో కార్తీ - Sakshi

'ఖాకీ' డ్రస్లో కార్తీ

కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన ప్రతీ సినిమాను

కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన ప్రతీ సినిమాను తమిళ్తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసే ఆ కోలీవుడ్ స్టార్, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను కూడా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశాడు.

తమిళ్లో ధీరన్ అధిగరమ్ ఓండ్రు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో ఖాకీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. శతురంగ వేట్టై ఫేం వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement