నిర్మాతలుగా స్టార్ హీరోయిన్లు..!

స్టార్ హీరోలు నిర్మాతలుగా మారి వారి సినిమాలను సొంత బ్యానర్లో నిర్మించడమే కాకుండా.. చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే వీరి బాటలోనే హీరోయిన్లు కూడా నడుస్తున్నట్లు కనపిస్తోంది. కాజల్ అగార్వాల్, తమన్నాలు నిర్మాతలుగా మారబోతోన్నారని సమాచారం.
కాజల్ అగర్వాల్, తమన్నాలు భాగస్వామ్యులుగా అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించబోతోన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా కల్కి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తైయిన తరువాత ఈ చిత్రం పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. మరి నిర్మాతలుగా మారుతున్న ఈ హీరోయిన్లకు అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి