బీబర్‌తో ఉన్న ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరో? | Justin Bieber spotted with a mystery woman after Brazilian gig | Sakshi
Sakshi News home page

బీబర్‌తో ఉన్న ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరో?

Published Fri, Mar 31 2017 1:20 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

బీబర్‌తో ఉన్న ఆ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరో?

లాస్‌ ఎంజెల్స్‌: నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ హాలీవుడ్‌ యువ పాప్‌ కెరటం జస్టిన్‌ బీబర్‌ మరోసారి గాసిప్‌ వార్తల్లో దర్శనం ఇచ్చాడు. బ్రెజిల్‌లో ప్రదర్శన ఇచ్చిన అతగాడు అనంతరం కొత్తగా ఓ మిస్టరీ గర్ల్‌ఫ్రెండ్‌తో కనిపించాడు. వారితో ఆ గర్ల్‌ఫ్రెండ్‌ స్నేహితురాలు కూడా కనిపించింది. ఆమె ఫొటో తీసేందుకు విలేకరులు ఎంత ప్రయత్నించినప్పటికీ అవకాశం లేకుండా పోయింది. బ్రెజిల్‌ రాజధాని రియోడిజనిరోలో బీబర్‌ తన పాప్‌ గీతాలతో హోరెత్తించాడు.

అనంతరం అతడితో గతంలో ఎప్పుడూ చూడని ఓ అమ్మాయి భుజాలపై చేయి వేసి ఏం చక్కా హోటల్‌ ఫోసానోలో పార్టీకి హాజరైనట్లు హాలీవుడ్‌ లైఫ్‌ అనే వెబ్‌ సంస్థ తెలిపింది. ఆ యువతి ల్యూసియానా చామోన్‌ అయ్యుంటుందని పేర్కొంది. ఆమెకు మారినా పుమార్‌ అనే స్నేహితురాలు ఉందని, ఆమెను కూడా పార్టీకి ఆహ్వానించారని, హోటల్‌లో ముగిసిన తర్వాత తిరిగి బీబర్‌ ప్రైవేట్‌ ఇంటికి వెళ్లి అక్కడ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారని కూడా ఆ సంస్థ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement