
చాన్ కోంగ్... జాకీ చాన్ ఎలా అయ్యాడు?
జాకీ చాన్... ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కానీ, ఈ పేరు వెనక ఓ చిన్న స్టోరీ ఉంది తెలుసా? జాకీ చాన్ అసలు పేరు చాన్ కోంగ్ సాంగ్.
జాకీ చాన్... ప్రపంచ సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కానీ, ఈ పేరు వెనక ఓ చిన్న స్టోరీ ఉంది తెలుసా? జాకీ చాన్ అసలు పేరు చాన్ కోంగ్ సాంగ్. మరి.. జాకీ చాన్ ఎలా అయ్యారు అనుకుంటున్నారా? ఆ స్టోరీలోకి వస్తే... అది 1990. ఆ ఏడాది జాకీ చాన్‌గా మారారు చాన్ కోంగ్ సాంగ్. ఇతగాడి సినీ రంగప్రవేశం ఐదేళ్ల వయసులోనే జరిగింది. చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ చిన్నోడు.. కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు కావడంతో ఒకవైపు కాలేజీలో చదువుకుంటూనే, ఇంకో వైపు భవన కూలీగా చేశారు.
జాకీ అనే వ్యక్తి అత్యంత చిన్న వయసులో కూలీగా చేరిన చాన్‌ను చేరదీసి, ఆ పనిలో మెళుకువలు నేర్పించారు. జాకీ శిష్యరికంలో చాన్ రాటుదేలడంతో అక్కడున్నవారంతా అతన్ని ‘లిటిల్ జాకీ’ అని పిలిచేవారట. గురువు మీద మమకారంతో చాన్ తన పేరును జాకీ చాన్‌గా మార్చుకున్నారు. జాకీ చాన్ పేరు వెనక స్టోరీ ఇదే. కాలేజీ పూర్తయ్యాక సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు చేసినప్పట్నుంచీ టైటిల్ కార్డ్‌లో ‘జాకీ చాన్’ అని పేరు వేయించుకోవడం మొదలుపెట్టారు. గురువు మీద జాకీకి ఉన్న గౌరవానికి ఇది నిదర్శనం. సో స్వీట్ కదూ...!