అతను సెట్‌లో ఉంటే నవ్వులే నవ్వులు! | If he's on the set laughing, smiling! | Sakshi
Sakshi News home page

అతను సెట్‌లో ఉంటే నవ్వులే నవ్వులు!

May 26 2015 12:32 AM | Updated on Sep 3 2017 2:40 AM

అతను సెట్‌లో ఉంటే నవ్వులే నవ్వులు!

అతను సెట్‌లో ఉంటే నవ్వులే నవ్వులు!

‘‘కొన్ని చిత్రాలు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ‘దిల్ ధడక్నే దో’ అలాంటి ఆ కోవలోకే వస్తుంది’’ అని ప్రియాంకా చోప్రా అంటున్నారు.

‘‘కొన్ని చిత్రాలు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ప్రస్తుతం చేస్తున్న ‘దిల్ ధడక్నే దో’ అలాంటి ఆ కోవలోకే వస్తుంది’’ అని ప్రియాంకా చోప్రా అంటున్నారు. ఈ చిత్రం తనకెందుకు అంత మంచి అనుభూతిని మిగిల్చిందో ప్రియాంక చెబుతూ -‘‘నేను ఒక సినిమా చేస్తున్నానంటే ఆ యూనిట్‌లో ఉన్న అందరితో స్నేహంగా ఉండడం నా అలవాటు. ఈ చిత్రంలో నేను, అనుష్క శర్మ నటిస్తున్నాం.
 
 అనుష్క శర్మ మంచి నటి. అలాగే, తనకు ఎలాంటి పాత్రలు నప్పుతాయో ఆమెకు బాగా తెలుసు. ఉన్నమాట చెప్పాలంటే, అనుష్క వల్ల ‘దిల్ ధడక్నే దో’ సినిమాకు మరింత అందం వచ్చింది. ఈ సినిమాకు ఆమె పాత్ర చాలా కీలకం. ఈ చిత్రం కోసం అనుష్క, నేను, ఇతర తారాగణం పాల్గొనగా చిత్ర దర్శకురాలు జోయా అక్తర్ ఓ పాట చిత్రీకరించారు. ఆ పాట చిత్రీకరణ సమయంలో చాలా ఎంజాయ్ చేశాం.
 
 ఒకరితో ఒకరు పోటీ పడుతూ షాట్ గ్యాప్‌లో గేమ్స్ ఆడుకునే వాళ్లం. అనుష్క, నేను కలిస్తే మా అల్లరికి అంతు ఉండేది కాదు. చాలా చిలిపి సంభాషణలు మా మధ్య దొర్లేవి. ఇక, చిత్రకథానాయకుడు రణవీర్ సింగ్ గురించి చెప్పాలి. ఆయన చాలా మంచి నటుడు. అలాగే చాలా సరదా వ్యక్తి కూడా. రణవీర్ సెట్స్ పై ఉన్నాడంటే ఇక నవ్వులే నవ్వులు. అతనితో సినిమా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement