27న ఇదునమ్మఆళు | Idhu Namma Aalu on 27th may | Sakshi
Sakshi News home page

27న ఇదునమ్మఆళు

May 25 2016 3:33 AM | Updated on Sep 4 2017 12:50 AM

27న ఇదునమ్మఆళు

27న ఇదునమ్మఆళు

ఎట్టకేలకు ఇదునమ్మఆళు చిత్రానికి మోక్షం కలిగింది. ఈ నెల 27న తెరపైకి రానుంది. సంచలన నటుడుగా ముద్రపడిన శింబు నటించిన చిత్రం ఇదునమ్మఆళు.

ఎట్టకేలకు ఇదునమ్మఆళు చిత్రానికి మోక్షం కలిగింది. ఈ నెల 27న తెరపైకి రానుంది. సంచలన నటుడుగా ముద్రపడిన శింబు నటించిన చిత్రం ఇదునమ్మఆళు. ఆయనకు జంటగా తన మాజీ ప్రేయసి నయనతార నటించిన ఇందులో నటి ఆండ్రియా, సంతానం, సూరి ముఖ్య పాత్రలను పోషించారు. శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై టి.రాజేందర్ నిర్మించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రంలో ఒక పాటకు నయనతార నటించాల్సి ఉన్నా తాను కేటాయించిన కాల్‌షీట్స్ కంటే అధికంగానే ఈ చిత్రానికి ఇచ్చానని ఇకపై నటించేది లేదని ఆమె ఖరాకండీగా చెప్పినట్లు ప్రచారం జరిగింది.

మొత్తం మీద చిత్రాన్ని పూర్తి చేసిన చిత్రం యూనిట్ ఇదునమ్మఆళు చిత్రాన్ని ఈ నెల 27 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి శింబు తమ్ముడు కురలరసన్ సంగీతాన్ని అందించారు. ఇందులో టి.రాజేందర్, గాయని సుచిత్ర పాడిన మామా వెయిట్టింగ్ అనే పాటను శింబు తెలుగు నటి ఆషాశర్మలపై ఇటీవల భారీ ఎత్తున్న చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. పాటలో శింబు 90 సెకన్ల పాటు ఒంటికాలుతో నటించి అందరి ప్రశంసలు పొందారట.

ఈ పాటకు అభిమానులు థియేటర్ సీట్లలో నుంచి లేచి ఆనందంతో చప్పట్లు కొడతార ని అన్నారు. ఈ పాటను చిత్రంలో ఉండకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు జరగాయని, అయినా ఆ పాట కావలసిందేనని టి.రాజేందర్ రెండు కోట్ల ఖర్చుతో ఈ పాటను చిత్రీకరించారని తెలిపారు. ఇదునమ్మఆళు చిత్రాన్ని ఈ నెల 27న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement