‘కంగనా ఓ అద్భుతం.. ఇలా ఊహించలేదు’ | I Had No Idea She'd 'Become Such A Huge Star : Anurag Basu | Sakshi
Sakshi News home page

కంగనా ఓ అద్భుతం.. ఇలా ఊహించలేదు : డైరెక్టర్‌

Oct 3 2017 3:55 PM | Updated on Aug 21 2019 10:25 AM

 I Had No Idea She'd 'Become Such A Huge Star : Anurag Basu - Sakshi

ముంబయి : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను చూసి తనకు చాలా గర్వంగా ఉందని ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ బసు అన్నారు. తనతోకలిసి ఏడేళ్ల కిందట గ్యాంగ్‌స్టర్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన కంగనాను చూస్తే తనకు నిజంగా ఆశ్చర్యం వేస్తోందని అన్నారు.

'నేను నా చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆమె కళ్లల్లో ఓ మెరుపు చూశాను.. కానీ, నిజంగా ఆమె ఇంత పెద్ద నటి అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఆమె నిజంగా పెంటాస్టిక్‌, ప్రతి చిత్రానికి ఆమెలో పరిణతి పెరుగుతూ వస్తోంది. ఆమె పోషిస్తున్న ప్రతి పాత్రలో ఎంతో వైరుధ్యం చూపిస్తోంది. క్వీన్‌, తను వెడ్స్‌ మను వంటి చిత్రాలే కాదు.. రంగూన్‌, కట్టి బట్టి, సిమ్రాన్‌ చిత్రాలు కూడా అద్భుతం. రంగూన్‌, కట్టిబట్టి, సిమ్రాన్‌ చిత్రాలకు వచ్చిన క్రిటిక్స్‌ను నేను పట్టించుకోను. ప్రతి చిత్రంలో ఆమె నటన అద్భుతం' అంటూ ఆయన తెగ పొగిడేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement