'ఖాన్'లతో పనిచేయడానికి సిద్ధం!:విద్యా బాలన్ | I don't miss working with Khans,says Vidya Balan | Sakshi
Sakshi News home page

'ఖాన్'లతో పనిచేయడానికి సిద్ధం!:విద్యా బాలన్

Jun 30 2014 2:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఖాన్'లతో పనిచేయడానికి సిద్ధం!:విద్యా బాలన్ - Sakshi

'ఖాన్'లతో పనిచేయడానికి సిద్ధం!:విద్యా బాలన్

ఇప్పటివరకూ 'ఖాన్' ల కాంబినేషన్ లో నటించని బాలీవుడ్ విద్యాబాలన్.. వారితో చేయడానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసింది.

ముంబై:ఇప్పటివరకూ  'ఖాన్' ల కాంబినేషన్ లో నటించని బాలీవుడ్ విద్యాబాలన్.. వారితో చేయడానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొత్తగా బాలీవుడ్ కు పరిచయమైన ఆలీ ఫజల్ కు జోడీగా నటిస్తున్న 'బాబీ జాసెస్' చిత్రంతో బిజీగా ఉన్న విద్యాబాలన్..ఇక తాను ఖాన్ లతో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.' నేను ఇప్పటి వరకూ వారితో పని చేయలేదు.ఫలానా వ్యక్తులతో చేయాలనే ఆంక్షలు కూడా ఏమీ లేవు. తగిన స్క్రిప్ట్ దొరికితే ఆ హీరోలతో యాక్ట్ చేసేందుకు సిద్ధం'అని విద్య తెలిపింది. తన కెరీర్ గురించి ఇప్పటి వరకూ సరైన ప్రణాళికను రచించుకోలేదని.. కేవలం  కథా బలాన్ని బట్టే సినిమాలను ఎంపిక చేసుకుంటానని పేర్కొంది.

 

ప్రస్తుతానికి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమిర్ ఖాన్ లతో ప్రాజెక్టులు ఏమీ సిద్దంగా లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా విద్య తెలిపింది. తాజాగా విద్యాబాలన్.. మహేష్ భట్ దర్శకత్వంలో చేయడానికి సంతకం చేసింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ఆరంభంకానుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement