బికినీ వేసుకోవడం నాకిష్టం లేదు! | I don't like to wear bikini | Sakshi
Sakshi News home page

బికినీ వేసుకోవడం నాకిష్టం లేదు!

May 24 2014 12:30 AM | Updated on Sep 2 2017 7:45 AM

బికినీ వేసుకోవడం నాకిష్టం లేదు!

బికినీ వేసుకోవడం నాకిష్టం లేదు!

ఉత్తరాది నుంచి వచ్చి, దక్షిణాది చిత్రాలతో పెద్ద తారగా ఎదిగిన నటి - తమన్నా భాటియా. ఆ మధ్య ‘హిమ్మత్‌వాలా’ రీమేక్ ద్వారా మళ్ళీ హిందీలో ప్రయత్నించి, విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మిల్కీ బ్యూటీ తాజాగా మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు.

ఉత్తరాది నుంచి వచ్చి, దక్షిణాది చిత్రాలతో పెద్ద తారగా ఎదిగిన నటి - తమన్నా భాటియా. ఆ మధ్య ‘హిమ్మత్‌వాలా’ రీమేక్ ద్వారా మళ్ళీ హిందీలో ప్రయత్నించి, విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మిల్కీ బ్యూటీ తాజాగా మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. సాజిద్ ఖాన్ ‘హమ్‌షకల్స్’లో కథానాయికలు బిపాసా బాసు, ఈషా గుప్తాలతో కలసి వెండితెరపై కనువిందు చేస్తున్నారు. ‘‘ఇలాంటి మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నప్పుడు మనదైన ప్రత్యేక ముద్ర వేయడం పెనుసవాలు. కానీ, అలాంటి సవాలును తలకెత్తుకొని, ఇలా మరో ఇద్దరు తారలతో ఆరోగ్యకరంగా పోటీ పడడం నాకు కూడా ఇష్టమే’’ అన్నారు తమన్నా. అయితే, ‘‘ఎవరికి వాళ్ళం మా పాత్రలు బాగా చేసినంత మాత్రాన ఉపయోగం లేదు.
సినిమా కూడా బాగా ఆడాలి. కాబట్టి, అందరం కలసికట్టుగా పని చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది’’ అని ఆమె తనదైన విశ్లేషణ చెప్పారు.

తాజా చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌తో కలసి నటిస్తున్న తమన్నా, ‘‘ఆయనతో కలసి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. పెపైచ్చు, నిజజీవితంలో కూడా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లాంటి చక్కటి జంటను నేను చూడలేదంటే నమ్మండి’’అని వ్యాఖ్యానించారు. సినిమా గురించి, దర్శకుడు సాజిద్ ఖాన్ గురించి పాజిటివ్‌గా ఇన్ని కబుర్లు చెబుతున్న తమన్నా ఈ చిత్రంలో ఓ సన్నివేశానికి మాత్రం నో చెప్పారు. బిపాసా బాసు, ఈషా గుప్తాలు బికినీలు ధరించి కనిపిస్తే, మన మిల్కీ బ్యూటీ మాత్రం షార్ట్స్‌లో దర్శనమిచ్చారు. ఆ మాటే అడిగితే, ‘‘నిజానికి, మేము ముగ్గురమూ బికినీలు వేసుకొని, నీళ్ళలో నుంచి బయటకు నడుచుకుంటూ వస్తుంటే, ఆ దృశ్యాన్ని చిత్రీకరించాలని దర్శకుడు సాజిద్ అనుకున్నారు. కానీ, బికినీ వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎప్పటి లానే ఆ మాట మీదే నిలబడ్డాను. చివరకు షార్ట్స్ వేసుకొని, పైన షార్ట్ టాప్ వేసుకొని ఆ దృశ్యంలో నటించాను’’ అని తమన్నా చెప్పారు. తారలంతా బికినీ డ్రెస్సులు, అధర చుంబన సన్నివేశాల్లో నిరభ్యంతరంగా పనిచేస్తుంటే, తమన్నా మాత్రం బికినీకి ఒప్పుకొనేది లేదు కాక ఒప్పుకొనేది లేదనడం విచిత్రమే.
 

Advertisement
 
Advertisement
Advertisement