నేను మళ్లీ వస్తున్నా... | i am coming back to act in movies: genelia | Sakshi
Sakshi News home page

నేను మళ్లీ వస్తున్నా...

Feb 27 2015 9:06 AM | Updated on Apr 3 2019 6:23 PM

నేను మళ్లీ వస్తున్నా... - Sakshi

నేను మళ్లీ వస్తున్నా...

మరోసారి తెరాగమనం చేస్తానంటోంది జెనీలియా.

జెనిలీయా.. ఈ పేరు వింటే చాలు...'అంతేనా..వీలైతే నాలుగు మాటలు...కుదిరితే కప్పు కాఫీ' డైలాగ్స్ ఠక్కున గుర్తస్తాయి. 'సై' అంటూ హుషారుగా ...'బొమ్మరిల్లు' చిత్రంలో తన నటనతో మార్కులు కొట్టేసిన ఈ అమ్ముడు ప్రస్తుతం కొడుకుతో ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను జెన్నీ 2012 వివాహం చేసుకుంది. 

పెళ్లి తర్వాత తెరమీద ఆమె ముఖమే కనిపించకపోవటంతో  అభిమానులను కొంతనిరాశను మిగిల్చింది. అయితే జెనీలియ మరోసారి తెరాగమనం చేస్తానంటోంది. అతి త్వరలోనే ఓ చిత్రంలో నటించనున్నట్లు చెబుతోంది.  అయితే అది బాలీవుడ్ చిత్రమా, టాలీవుడ్ చిత్రామా అనేది మాత్రం చెప్పలేదు.  అంతేకాకుండా తన భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి బాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించనుందట.  అయితే వీటన్నిటి కన్నా 'మాతృత్వాన్ని మించిన వరం మహిళలకు మరొకటి లేదని, తన ప్రసవ సమయంలో భర్త చూపించిన ఆదరణ దేనితోను పోల్చనేనని' జెనీలియా చెప్పటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement