పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30

Hrithik Roshans Movie Picks Up Pace At Box Office - Sakshi

ముంబై : బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ టైటిల్‌ పాత్రలో గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌గా తెరకెక్కిన సూపర్‌ 30 బాక్సాఫీస్‌ వద్ద డ్రీమ్‌రన్‌ కొనసాగిస్తోంది. నాలుగో వారంలోనూ నిలకడగా వసూళ్లు సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది. నాలుగోవారంతో కలుపుకొని సూపర్‌ 30 భారత్‌లో రూ 134.71 కోట్లు కలెక్ట్‌ చేసిందని ట్రేడ్‌ అనలిస్ట్‌, సినీ విమర్శకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

కొత్త సినిమాలు థియేటర్లకు క్యూ కట్టినా సూపర్‌ 30 స్ర్టాంగ్‌ రన్‌ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. మరోవైపు ఓవర్సీస్‌లోనూ సూపర్‌ కలెక్షన్స్‌ రాబడుతోంది. ఓవర్సీస్‌లో ఆగస్ట్‌ 1 వరకూ ఈ మూవీ ఏకంగా రూ 35.05 కోట్లు కొల్లగొట్టింది. హృతిక్‌తో పాటు ఈ సూపర్‌ 30లో టీవీ నటి మృణాల్‌ ఠాకూర్‌, వీరేంద్ర సక్సెనా, జానీ లీవర్‌, పంకజ్‌ త్రిపాఠి తదితరులు నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top