ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

Hrithik Roshan Got 30000 Marriage Proposals - Sakshi

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు హృతిక్‌ రోషన్‌  ఆసక్తికర విషయం బయటపెట్టాడు. తన మొదటి చిత్రం విడుదలైన తర్వాత వేల సంఖ్యలో పెళ్లి ప్రపోజల్స్‌ వచ్చాయని వెల్లడించాడు. పాపులర్‌ టీవీ కార్యక్రమంలో కపిల్‌ శర్మ షోలో ఈ విషయం చెప్పాడు. ‘కహోనా ప్యార్‌ హై’ సినిమా విడుదలైన తర్వాత తనకు  30 వేలకు పైగా పెళ్లి ప్రపోజల్స్‌ వచ్చినట్టు హృతిక్‌ తెలిపాడు. 2000లో విడుదలైన ‘కహోనా ప్యార్‌ హై’ చిత్రంతో వెండితెరకు అతడు పరిచయమయ్యాడు. అదే ఏడాది తన చిన్ననాటి స్నేహితురాలు సుశానే ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2014లో వీరిద్దరూ విడిపోయారు.

‘కహోనా ప్యార్‌ హై’ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో హృతిక్‌ రోషన్‌, అమిషా పటేల్‌ ఓవర్‌నైట్‌ స్టార్స్‌ అయ్యారు. రాకేశ్‌ రోషన్‌ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా 2000లో అత్యధిక గ్రాస్‌వసూళ్లు సాధించి, ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. అంతేకాకుండా ఏడాది కాలంలో 92 పురస్కారాలు దక్కించుకుని గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది.  గత  20 ఏళ్లలో బాలీవుడ్‌లో వచ్చిన  సినిమాల్లో బెస్ట్‌గా నిలిచింది. హృతిక్‌ తాజా చిత్రం ‘వార్‌’ విడుదలకు సిద్ధమైంది. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌, వాణి కపూర్‌ ముఖ్యపాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top