భయపెట్టేందుకు వస్తున్నారు! | Sakshi
Sakshi News home page

భయపెట్టేందుకు వస్తున్నారు!

Published Sun, Sep 15 2019 12:15 PM

Horror Thriller Raju Gari Gadhi 3 Trailer Unveiled - Sakshi

రాజుగారి గది, రాజుగారి గది2 సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఓంకార్‌ ఇప్పుడు అదే సిరీస్‌లో మూడు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా రాజుగారి గది3 చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాతో లాంగ్ గ్యాప్‌ తరువాత అవికా గోర్‌ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. అలీ, బ్రహ్మాజీ, ధనరాజ్‌, అజయ్‌ ఘోష్‌, ఊర్వశి, హరితేజలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సీనియర్‌ హీరో విక్టరి వెంకటేష్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో రూపొందించిన ఈ ట్రైలర్‌ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. షబీర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement