హార్రర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘రహస్యం’

Horror Action Entertainer Rahasyam Movie Pre Release Event - Sakshi

శైలేష్ , శ్రీ రితిక జంటగా సాగర్ శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రహస్యం. ఈ సినిమాను భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరు కాగా సి.కల్యాణ్, శివశక్తి దత్తా, రాజ్ కందుకూరి, యంగ్ హీరో మానస్, శివ శంకర్ మాస్టర్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ..  నిర్మాత రామసత్యనారాయణ వంద చిత్రాలకు చేరువయ్యారు. తను నాకు ఆత్మీయుడు. మంచి సినిమాను తీయటంతో పాటు దాన్ని వైవిధ్యంగా ప్రమోట్ చేస్తారు. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువవస్తుందని భావిస్తున్నాను. చిన్న చిత్రాల ద్వారా కూడా  డబ్బు ఎలా సంపాదించాలన్నది రామ సత్యనారాయణ గారిని చూసి నేర్చికోవాలన్నారు.

ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. రామసత్యనారాయణ సినిమాను ప్రేమించే వ్యక్తి, వంద చిత్రాలను తీసిన తెలుగు నిర్మాతగా రామానాయుడు గారు, రామ సత్యనారాయణ నిలిచిపోతారు. తన సినిమా ఫంక్షన్ అంటే అది నా సినిమా ఫంక్షన్ లానే ఉంటుంది‌. రహస్యంతో తాను లాభాలను సాందిచాలని ఆసిస్తున్నానన్నారు.

రామసత్యనారాయణ మాట్లాడుతూ..కంటెంట్ బాగుంటేనే ఈ రోజు ఎంతటి స్టార్ హీరో  సినిమా అయినా ఆడుతుంది. లేదంటే ప్రేక్షకులు ఎలాంటి మోహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. రహస్యం కంటెంట్ ఉన్న చిత్రం. ఈ సినిమాను ముందు నుంచి ప్రమోట్ చేస్తొన్న వివి.వినాయక్, పూరీ జగన్నాథ్,రామ్ గోపాల్ వర్మ, రాజ్ కందుకూరి, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. రోశయ్య గారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. ఈ సినిమాను విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ షో వేసి చూపిస్తామన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top