
గ్రౌండ్‌లో దుమ్ము దులిపి, గోవాలో న్యూ ఇయర్‌కి వెల్‌కమ్ చెప్పి హైదరాబాద్‌కి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ తాప్సీ. బీటౌన్‌లో షాద్ అలీ దర్శకత్వంలో హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘సూర్మ’ చిత్రంలో హాకీ ప్లేయర్ హర్‌ప్రీత్ పాత్రలో నటిస్తున్నారు తాప్సీ. సందీప్ పాత్రలో దిల్జీత్ కనిపించనున్నారు. రీల్‌ౖలైఫ్‌లో సెర్బియా గ్రౌండ్‌లో హాకీ ప్లేయర్‌గా రెచ్చిపోయిన తాప్సీ న్యూ ఇయర్‌కు గోవా చేరుకుని రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు నూతనోత్సాహంతో షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారు.
అందుకే హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు నుంచి తెలుగులో ఆమె నటించబోయే సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి ఈ చిత్రంలో హీరో ఎవరు? అంటే కథే హీరో... ఇలాగే ఆన్సర్ చెప్పారు తాప్సీ. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో రచయిత కోన వెంకట్ ఓ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే తాప్సీ హైదరాబాద్ వచ్చారు.