
హ్యాపీ బర్త్ డే సందీప్: హీరోయిన్లు
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు వేడుకల్లో బిజీబిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు వేడుకల్లో బిజీబిజీగా ఉన్నాడు. గతంలో అతడి సరసన నటించిన అందాలభామలు రకుల్ ప్రీత్ సింగ్, రెజీనాలు సందీప్ కిషన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఇద్దరూ ట్విట్టర్ వేదికగా తమ విషెస్ తెలియజేశారు. రెజీనా అయితే సందీప్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుని ఆ ఫొటోను ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. తాతా ముఖానికి ఫేషియల్ అంటూ రాసుకొచ్చింది.
ఈ ట్వీట్ కు స్పందిస్తూ... థ్యాంక్యూ పాపా అంటూ సందీప్ రిప్లై ఇచ్చాడు. రకుల్ ప్రీత్ కూడా హ్యాపీ బర్త్ డే సందీప్ అని ట్వీట్ చేసింది. ఈ సంవత్సరం సందీప్ కు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని, ఎన్నో విజయాలు సాధించాలని తన పోస్ట్ లో పేర్కొంది. థ్యాంక్యూ బీపీ సింగ్ అంటూ రకుల్ ను ఆటపట్టిస్తూ సందీప్ కిషన్ కూడా మరో ట్వీట్ చేశాడు.
@ReginaCassandra Hhaha thank you Papa:)
— Sundeep Kishan (@sundeepkishan) 7 May 2016
@Rakulpreet thank you BP singh :)
— Sundeep Kishan (@sundeepkishan) 7 May 2016