ఫారిన్‌లో స్టెప్పులు

Gopichand Chanakya movie song shooting going on in Milan - Sakshi

‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా తన తెలివితేటలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశాడు చాణక్య. ఈ జోష్‌లో ప్రేయసితో కలిసి ఫారిన్‌లో స్టెప్పులేస్తున్నారు. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రంలో మెహరీన్, జరీన్‌ ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

అజయ్‌ సుంకర సహనిర్మాత. ఈ సినిమాలో గోపీచంద్‌ ‘రా’ ఏజెంట్‌గా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీ, మిలాన్‌లోని అందమైన పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పాటలను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: వెట్రి మారన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top