యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

Gopichand, Anil Sunkara movie next schedule on june 6 - Sakshi

విలన్ల పని పట్టడానికి రెడీ అవుతున్నారు గోపీచంద్‌. అందుకు ఆయన ఓ ప్లాన్‌ వేశారట. ఆ ప్లాన్‌ని వెండితెరపై చూడాల్సిందే. గోపీచంద్‌ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెహరీన్, జరీన్‌ఖాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ఆ మధ్య రాజస్తాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా గోపీచంద్‌ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్‌ పడిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ వచ్చే నెల 6న హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలను ప్లాన్‌ చేశారని సమాచారం. ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top