హీరో బుగ్గలు పిండేశారు!

Girl Pulls Luka Chuppi Star Kartik Aaryan Cheeks - Sakshi

బాలీవుడ్ క్యూట్‌ బాయ్‌ కార్తీక్‌ ఆర్యన్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. బాలీవుడ్‌ యంగ్ జనరేషన్‌ హీరోలలో తిరుగులేని లేడీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ చాక్లెట్‌ బాయ్‌ ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలు చుట్టూ చేరి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు. తాజాగా షూటింగ్‌ కోసం లక్నో వెళ్లిన కార్తీక్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది.

‘పతీ పత్నీ ఔర్‌ ఓ’ షూటింగ్ కోసం లక్నోలో ఉన్న కార్తీక్‌ ఆర్యన్‌ను చూసేందుకు అమ్మాయిలు గుమిగూడారు. అంతేకాదు హీరోను చూసిన ఆనందంలో అతడి బుగ్గలు పిండేశారు. కార్తీక్‌ కూడా ఎంతో  ఓపిగ్గా నవ్వుతూ అందరితో ఫోటోలు దిగుతూ అభిమానులను ఉత్సాహపరిచాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్యార్‌కా పంచనామా సినిమా తో పాపులర్‌ అయిన కార్తీక్‌ ఆర్యన్‌ తరువాత సోనూకే టిటు కి స్వీటి, లుకా చప్పీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. చార్మింగ్‌ లుక్స్‌, క్యూట్ స్మైల్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top