దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్‌

దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్‌ - Sakshi


నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌లో వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు భారీగా పాల్గొన్నారు.'మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయము లేదు మిత్రమా శరణమా.. రణమా' అంటూ బాలకృష్ణ తనదైన శైలి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top