ర్యాంకు రాకపోతే..! | First Rank Raju Latest Trailer launch | Sakshi
Sakshi News home page

ర్యాంకు రాకపోతే..!

Jun 20 2019 12:07 AM | Updated on Jun 20 2019 12:07 AM

First Rank Raju Latest Trailer launch - Sakshi

చేతన్‌ మద్దినేని

చేతన్‌ మద్దినేని హీరోగా నరేష్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’. ‘విద్య నూరు శాతం. బుద్ది సున్నా శాతం’ అనేది ఉపశీర్షిక. మంజునాథ్‌ వి. కందుకూర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్‌ కానుంది. చేతన్‌ మాట్లాడుతూ – ‘‘కష్టపడి చదివిన తర్వాత ర్యాంకు రాకపోతే ఇక జీవితమే లేదనే నేటి యువతరం ఆలోచనా ధోరణి సరైనది కాదన్న విషయాన్ని మా చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంకు సాధించే రాజు అనే వ్యక్తి లైఫ్‌ జర్నీ ఈ చిత్రం.

ఈ సినిమా స్టూడెంట్స్‌కి ఎంత ఇంపార్టెంటో, వారి ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా అంతే ఇంపార్టెంట్‌. ఈ చిత్రంలో నేను రాజు పాత్రలో నటించాను. నేను మూడు డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేశాను. కన్నడ ‘ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు’ ఆధారంగా ఈ సినిమా చేశాం. దర్శకుడు మారుతిగారు మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యేలా కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఆయన కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. సినిమా విడుదలలోనూ హెల్ప్‌ చేశారు. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement