ప్రపోజల్‌ని కాలుతో తన్నింది | Fidaa Trailer Released | Sakshi
Sakshi News home page

ప్రపోజల్‌ని కాలుతో తన్నింది

Jun 23 2017 10:38 PM | Updated on Sep 5 2017 2:18 PM

ప్రపోజల్‌ని కాలుతో తన్నింది

ప్రపోజల్‌ని కాలుతో తన్నింది

ఇది హార్ట్‌కి సంబంధించిన మేటర్‌రా.. హార్ట్‌కి.. అని తన ప్రేమ గురించి తెగ బాధపడిపోతున్నారు యువ నటుడు వరుణ్‌ తేజ్‌.

ఇది హార్ట్‌కి సంబంధించిన మేటర్‌రా.. హార్ట్‌కి.. అని తన ప్రేమ గురించి తెగ బాధపడిపోతున్నారు యువ నటుడు వరుణ్‌ తేజ్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఫిదా చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సాయి పల్లవి కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. 'నా ప్రపోజల్‌ని కాలుతో తన్నింది' అని వరుణ్‌తేజ్‌ డైలాగ్‌ మరింత ఆకట్టుకుంటోంది. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందనే దాన్ని తనదైన కుటుంబ విలువలను జోడించడం ద్వారా ఆవిష్కరించారు శేఖర్‌ కమ్ముల. గత చిత్రాల మాదిరిగానే ఇందులోనూ కథానాయిక పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దారు.

లైఫంతా ఆ ముగ్గురు కోతులకు చాకిరి చేసి చచ్చిపోతావే..
ప్రపోజల్‌ని కాలుతో తన్నింది..
అతనితో సగం సగం ఈడ ఉండలేను..
ఈ పిల్లకు లెక్కలేదు.. ఓన్లీ తిక్కే..
అప్పుడు మంచి భాను.. ఇప్పుడు చెత్త భాను..
జీవితాంతం ఒకరితో ఉండాలనుకుంటాం కదా.. అది ఈమే..
అంటూ ట్రైలర్‌లో ఉండే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, జులై 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement