క్షణ క్షణం ఉత్కంఠ

evary Moment of suspense

పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్‌ నందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం  ‘దేవిశ్రీ ప్రసాద్‌’. శ్రీ కిషోర్‌ దర్శకత్వంలో డి.వెంకటేశ్, ఆర్వీ రాజు, ఆక్రోశ్‌ నిర్మించిన ఈ సిన్మాట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీ కిషోర్‌ మాట్లాడుతూ– ‘‘ధనరాజ్‌గారికి లైన్‌ చెప్పగానే నచ్చి, చేద్దామన్నారు. నిర్మాత కోసం చూస్తున్న టైమ్‌లో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆక్రోశ్‌ ఈ సినిమా తీద్దామని చెప్పారు. ఆర్వీ రాజు సపోర్ట్‌ చేశారు’’ అన్నారు.

‘‘ఇందులో ప్రతి సీన్‌ ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఉంటుంది. త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాతలు డి. వెంకటేశ్, బెక్కెం వేణు గోపాల్, రాజ్‌ కందుకూరి, హీరో నవీన్‌ చంద్ర, భూపాల్, మనోజ్‌ నందం, ధనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: చంద్ర వట్టికూటి.

Back to Top