మగాడి జీవితం మళ్లీ కోలుకోలేదు

E Ee Movie Trailer Launch by Director Maruthi  - Sakshi

‘నేనెప్పుడూ ఏ అమ్మాయిని లవ్‌ చేయలేదు. ఎవరినీ ఇష్టపడలేదు. అమ్మాయిలంటే నాకు మంచి ఒపీనియన్‌ కూడా లేదు. హుద్‌హుద్‌ వచ్చినప్పుడు విశాఖ కోలుకుందేమో కానీ, మీ ఆడవాళ్ల వల్ల గాయపడిన ఏ మగాడి జీవితం మళ్లీ కోలుకోలేదు... ఆనందంగా ఉంచడమంటే అవసరాలు తీర్చడం కాదు. ఆశలు తీర్చడం’ వంటి డైలాగులు ‘ఇ ఈ’ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.  నీరజ్‌ శ్యామ్, నైరా షా జంటగా రామ్‌ గణపతిరావు దర్శకత్వంలో లక్ష్మణ్‌రావు నిర్మించిన సిన్మా ‘ఇ ఈ’. సీనియర్‌ నటుడు సుధాకర్‌ కీలక పాత్రలో   నటించారు.

ఈ సిన్మా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘నేనూ, రామ్‌ స్నేహితులం. యానిమేటింగ్‌లో కలిసి పనిచేశాం. తనేమో ఫ్రాన్స్‌ వెళ్లి అదే రంగంలో డెరైక్టర్‌గా ఎదిగాడు. నేను దర్శక, నిర్మాతగా మారా. రామ్‌ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అన్నారు. ‘‘ఇ’ అంటే ఇతడు, ‘ఈ’ అంటే ఈమె అని అర్థం. కథాకథనాలు కొత్త తరహాలో ఉంటాయి’’ అన్నారు దర్శకుడు. ఈ నెల్లోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని లక్ష్మణ్‌రావు తెలిపారు. నీరజ్‌ శ్యామ్, నైరా షా సంగీత దర్శకుడు కృష్ణ చేతన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top