ఖైదీ తర్వాత దొంగ ఏంటి?

Donga Movie Pre Release Event - Sakshi

‘‘ఊపిరి’ సినిమాలో కార్తీ నటన అద్భుతం. తన గురించి చెప్పాలంటే వెయ్యిలో ఒక్కడు. మూడు సార్లు బెస్ట్‌ యాక్టర్‌గా ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ గెలుచుకున్నారు. జీతూ చాలా తెలివైన డైరెక్టర్‌. ‘ఖైదీ’ కంటే ‘దొంగ’ చిత్రం పెద్ద హిట్‌ అవ్వాలి’’ అని సీనియర్‌ దర్శకులు శివనాగేశ్వర రావు అన్నారు. కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్‌  జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగ’. వయాకామ్‌ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో హర్షిత మూవీస్‌ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్‌ రిలీజ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ ఏంటి? అని అందరూ అడుగుతున్నారు.

రెండూ చిరంజీవిగారికి పెద్ద హిట్‌ ఇచ్చిన టైటిల్సే. స్క్రిప్ట్‌కి తగ్గట్టే ఈ రెండు పేర్లు పెట్టాం. ‘దొంగ’ కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అక్కాతమ్ముడు రిలేషన్‌షిప్‌ ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషనల్‌గా అనిపించింది. మా నాన్న క్యారెక్టర్‌ సత్యరాజ్‌గారు చేశారు. మా మూడు పాత్రలు సినిమాకి పిల్లర్స్‌ లాంటివి. ‘నా పేరు శివ, ఊపిరి’ కలిపితే వచ్చిన వైవిధ్యమైన సినిమాలా ‘దొంగ’ ఉంటుంది’’ అన్నారు. ‘‘దృశ్యం’ సినిమా తెలుగులో రీమేక్‌ అయి పెద్ద విజయం సాధించినప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు ‘దొంగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు జీతూ జోసెఫ్‌. నటుడు సత్యరాజ్, డైలాగ్‌ రైటర్‌ హనుమా¯Œ చౌదరి, హీరోయి¯Œ  నిఖిలా విమల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top