'ఫస్ట్ టైం వ్యభిచారిగా నటిస్తున్నాను' | Divya Dutta to play prostitute, says 'it's interesting' | Sakshi
Sakshi News home page

'ఫస్ట్ టైం వ్యభిచారిగా నటిస్తున్నాను'

Jan 18 2016 4:48 PM | Updated on Apr 3 2019 6:23 PM

'ఫస్ట్ టైం వ్యభిచారిగా నటిస్తున్నాను' - Sakshi

'ఫస్ట్ టైం వ్యభిచారిగా నటిస్తున్నాను'

విభిన్న పాత్రలతో మెప్పించడమే కాకుండా ఇటీవల 'చాక్ ఎన్ డస్టర్' చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి అందరి అసహనానికి గురైన బాలీవుడ్ నటి ప్రియాదత్త ఇప్పుడు అనూహ్య పాత్రతో ముందుకు రానుంది.

న్యూఢిల్లీ: విభిన్న పాత్రలతో మెప్పించడమే కాకుండా ఇటీవల 'చాక్ ఎన్ డస్టర్' చిత్రంలో నెగెటివ్ పాత్రలో నటించి అందరి అసహనానికి గురైన బాలీవుడ్ నటి ప్రియాదత్త ఇప్పుడు అనూహ్య పాత్రతో ముందుకు రానుంది. ఆమె వ్యభిచారి పాత్రలో నటించనుంది. అలా నటించాలని తనకు ఎప్పటి నుంచో ఉందని చెప్పింది. ఇంతవరకు ఆ కోవకు చెందిన పాత్ర తన ముందుకు రాలేదని, తొలిసారి వేశ్యగా నటించడం ఆసక్తిగా అనిపిస్తోందని పేర్కొంది.

కోల్ కతాలోని సోనాగచి అనే రెడ్ లైట్ ఏరియాకు చెందిన వ్యభిచారుల పిల్లల నేపథ్యంతో 2004లో 'బోర్న్ ఇన్ టూ బ్రూత్లెస్' అనే డాక్యుమెంటరీ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు అదే చిత్ర నేపథ్యంలో మరో చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అరూప్ దత్తా దర్శకత్వం వహించనున్నారు. 'నేను అరూప్ దత్తా చిత్రంలో ప్రాస్టిట్యూట్ గా నటిస్తున్నాను. మేం మార్చిలో షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కోల్ కతాలోని రెడ్ లైట్ ప్రాంతంలోనే షూటింగ్ జరపనున్నాం. సాప్నా పబ్బి, సీమా బిస్వాస్ నాతోపాటు నటిస్తున్నారు. వ్యభిచారి పాత్ర చాలా కష్టమైనది.. వాస్తవ జీవితానికి సంబంధించినది. అందుకే నాకు కొంత ఆసక్తిగా ఉంది' అంటూ దివ్యాదత్త చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement