హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది

Published Fri, Jan 29 2016 1:42 PM

హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది

తొలి సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమాగా ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించేస్తోంది దిశాపటాని. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన దిశ, ఇప్పుడు జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం ఉన్న ఈ బ్యూటి, ఈ సినిమాలో జాకీకి జోడిగా నటిస్తోందట.

సోనూసూద్, అమైరా దస్తర్ లాంటి భారతీయ నటులు నటిస్తున్న ఈ సినిమా కథ ఇండియా, చైనాల నేపథ్యంలో సాగుతోంది. టిబెట్లో ఉన్న ఒక నిధి వేటలో భాగంగా ఇండియాకు వచ్చే జాకీచాన్కు, ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్లో పనిచేసే దిశ సాయం చేస్తోంది. ఇద్దరు కలిసి ఆ నిధిని ఎలా సాధించారు అన్నదే సినిమా కథ. కథా పరంగా దిశాపటానీ లీడ్ హీరోయిన్ అనిపిస్తోంది. మరి ఈ ఛాన్స్తో దిశ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement