 
															‘చండీ’గా ప్రియమణి విజృంభణ
													 
										
					
					
					
																							
											
						 ‘‘ఇప్పటివరకూ ప్రియమణి చేసిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. ‘చండీ’గా ప్రియమణి విజృంభించి నటించింది. తన డైలాగ్ డెలివరీ అద్భుతంగా కుదిరింది’’ అని సముద్ర తెలిపారు.
						 
										
					
					
																
	‘‘ఇప్పటివరకూ ప్రియమణి చేసిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. ‘చండీ’గా ప్రియమణి విజృంభించి నటించింది. తన డైలాగ్ డెలివరీ అద్భుతంగా కుదిరింది’’ అని సముద్ర తెలిపారు. ఆయన దర్శకత్వంలో ప్రియమణి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘చండీ’. కృష్ణంరాజు, శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషించారు. 
	 
	 జి.జగన్నాథనాయుడు సమర్పణలో డా.జి.శ్రీనుబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ -‘‘సంగీత దర్శకుడు ఎస్.ఆర్.శంకర్‌కి తొలి చిత్రమైనా మంచి పాటలిచ్చారు. అల్లూరి సీతారామరాజు పాటకు మంచి స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. 
	 
	 దర్శకుడు అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారని ప్రియమణి పేర్కొన్నారు. సినిమా మొత్తం పూర్తయిందని, త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా రంగనాథ్, రెజీనా, ఎస్సార్ శంకర్, జీవీ, బేబి ఆని తదితరులు మాట్లాడారు.