100 మిలియ‌న్ మార్కును దాటిన 'ఇస్మార్ట్' పాట‌

Dimak Kharab Song From Ismart Shankar Movie Crossed 100 Million - Sakshi

'ఇస్మార్ట్ శంర్' ..ఈ సినిమా థియేట‌ర్స్‌లో ఎన్ని క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిందో యూట్యూబ్‌లోనే అంతే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బ‌రాత్ అయినా, కాలేజీ ఫంక్ష‌న్ అయినా ఈ సినిమా పాటలు ఉండాల్సిందే. గతేడాది సెప్టెంబర్‌లో  విడుదలైన దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ విడుద‌లైన నాటి నుంచే యూట్యూబ్‌ని షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ని దాటింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసిన ఈ సాంగ్‌లో రామ్‌, నిధి అగ‌ర్వాల్ న‌భా న‌టాషాలు త‌మ డ్యాన్స్‌తో అల‌రించారు. పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ని మెస్మ‌రైజ్ చేసింది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి , హీరో రామ్‌కి ఈ సినిమా మంచి బూస్ట‌ప్ ఇచ్చింది. రామ్ కెరీర్‌లోనే తొలిసారి 40 కోట్ల‌ షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది.స‌రైన హిట్ కోసం చూస్తున్న వారికి ఇస్మార్ట్ శంక‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు.  ప్రస్తుతం పూరీ డైరెక్ష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top