
వరుస విజయాలతో కేరీర్‌లో దూసుకెళ్తునే భర్త రణ్‌వీర్ సింగ్‌తో వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె. ఈ అందాల తార.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2013 లో రామ్‌లీలా సినిమా సెట్‌లో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. గతేడాది డిసెంబర్‌లో వీరద్దరి వివాహం జరిగింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లికి ముందు సహజీవనంపై స్పందించారు. ’వివాహానికి ముందే సహజీవనం చేస్తే.. పెళ్లి తర్వాత జీవితంలో మధురానుభూతిని పొందగలమా? పెళ్లికి ముందే కాదు.. ఆ తర్వాత కూడా మా జీవితాలకు సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకొన్నాం. వివాహం అంటే నచ్చని వారు చాలా మంది ఉన్నారు. కానీ మేం అలాంటి వ్యక్తులం కాదు. వివాహ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు భార్యభర్తలుగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం’ అంటూ దీపికా చెప్పుకొచ్చింది.
కెరీర్ గురించి స్పందిస్తూ.. మా ఇంట్లో నా తల్లిదండ్రులు వర్కింగ్ పేరెంట్స్. నా సోదరి కూడా అలానే జీవితాన్ని కొనసాగిస్తున్నది. పెళ్లి తర్వాత కెరీర్‌ను కొనసాగిస్తూనే మా తల్లిదండ్రులు గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కెరీర్‌కు పెళ్లి అడ్డంకి కాదనే విషయాన్ని నమ్ముతాను. కెరీర్ హోదాను, గౌరవాన్ని కల్పిస్తుందని భావిస్తాను. అది కూడా నా తల్లిదండ్రుల నుంచే నేర్చుకొన్నాను అని దీపిక పదుకోనె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీపికా ‘ఛపాక్’ చిత్రంతో పాటు రణ్‌వీర్‌తో కలిసి ‘83’ అనే చిత్రంలో నటిస్తున్నారు. లెజండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.