
చుట్టాలబ్బాయి!
రానా హీరోగా నటించిన ‘కృష్ణంవందే జగద్గురుమ్’ విడుదలై రెండేళ్లు కావొస్తోంది. ఆ సినిమాతో నటునిగా తనకు మంచి పేరొచ్చినా.. సోలో హీరోగా మాత్రం ఏ సినిమాకూ ఆయన పచ్చజెండా ఊపలేదు.
రానా హీరోగా నటించిన ‘కృష్ణంవందే జగద్గురుమ్’ విడుదలై రెండేళ్లు కావొస్తోంది. ఆ సినిమాతో నటునిగా తనకు మంచి పేరొచ్చినా.. సోలో హీరోగా మాత్రం ఏ సినిమాకూ ఆయన పచ్చజెండా ఊపలేదు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ జానపద చిత్రం ‘బాహుబలి’లో ప్రతినాయకుడిగా, చరిత్రాత్మక కథాంశంతో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’లో చాళుక్య వీరభద్రునిగా నటిస్తూ బిజీగా ఉన్నారు రానా.
మరి సోలో హీరోగా రానా కనిపించేదెప్పుడు? అని అందరూ అనుకుంటున్న సమయంలో... ‘సోలో’ దర్శకుడు పరశురామ్... ఆ బాధ్యతను భుజానకెత్తుకున్నారు. త్వరలో రానా కథానాయకునిగా పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘చుట్టాలబ్బాయి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా తండ్రి సురేశ్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.